మత విద్వేషాలు జరగకుండా సహకరించాలని బొబ్బిలి సిఐ కే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని రాముడు వలస గ్రామంలో ఉన్న ఐజి బాప్టిస్ట్ చర్చి లో చర్చి అధ్యక్షులు సి హెచ్ యోహాను ఆధ్వర్యంలో శనివారం చర్చి నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇటీవల జరిగిన అన్యమత ప్రచారాల దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడం జరిగిందని, వీటివలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు జరగవని సీఐ తెలిపారు.