బొబ్బిలి: వార్డు సచివాలయ సిబ్బందితో చైర్మన్ సమీక్ష సమావేశం

63చూసినవారు
బొబ్బిలి: వార్డు సచివాలయ సిబ్బందితో చైర్మన్ సమీక్ష సమావేశం
పట్టణ సచివాలయాల వార్డు శానిటేషన్ సెక్రటరీలు, హెల్త్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్ సిబ్బంది ప్రజలు మెచ్చేలా విధులు నిర్వర్తించాలని బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ పేర్కొన్నారు. గురువారం కమిషనర్ చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంతమంది పారిశుధ్య సిబ్బంది ఉన్నది, వారికి ఏ విధంగా విధులను కేటాయించారు, ఎన్ని వాహనములు ఉన్నది, వాటి ద్వారా ఏవిధంగా చెత్తను సేకరిస్తున్నారన్న వివరాలను అడిగి తెలుసుకున్నరు.

సంబంధిత పోస్ట్