బొబ్బిలిలో ఉర్దూ అకాడమీ లైబ్రరీ ఆధ్వర్యంలో మంగళవారం చలో ఉర్దూ లైబ్రరీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రేరియన్ ఎంఏఖుద్దూస్ మాట్లాడుతూ ప్రాచీన భాష ఉర్దూ అని, రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ భాషగా గుర్తించిందని తెలిపారు. ఈ భాషను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, ఉర్దూ ప్రేమికులు, సాహితీవేత్తలు, విద్యార్థులు భాష ప్రాధాన్యం గుర్తించేందుకు ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు.