బొబ్బిలి పట్టణంలో ఉన్న రాణి మల్లమ్మదేవి మున్సిపల్ పార్కును సుందరంగా తీర్చి దిద్దాలని మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి ఆదేశించారు. మున్సిపల్ అధికారులతో శుక్రవారం పార్కును సందర్శించారు. మొక్కలకు ప్రతిరోజు నీరు పోసి ఆకులు సైడ్ కట్ చేసి సుందరంగా ఉంచాలన్నారు. మొక్కల సంరక్షణకు ఇద్దరు కార్మికులను, సూపర్ వైజర్ ను నియమించాలని మున్సిపల్ ఇంజినీర్ గుప్తాను ఆదేశించారు. ఆమెతో పాటు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.