బొబ్బిలి: కుక్కకు పాముకాటు... రక్షించిన వైద్యుడు

72చూసినవారు
బొబ్బిలి పట్టణంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న జి. లక్ష్మణరావు ఇంటిలోకి సోమవారం నాగుపాము చొరబడింది. అడ్డుకున్న పెంపుడు కుక్కను కాటు వేయడంతో విషం శరీరంలోకి వెళ్లి కుక్క నురగలు కక్కుతూ పడిపోయింది. ఇది గమనించిన యజమాని వెంటనే పక్కనే ఉన్న పశు సంవర్థక శాఖ ఏడీ ఎల్. విష్ణును సంప్రదించారు. ఆయన వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుక్కకు వైద్యం చేశారు. కుక్క ప్రాణాలు నిలవడంతో యజమానితో పాటు చుట్టు పక్కల వారు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్