రైతులు ఫేక్ లింక్స్‌తొ మోసపోకండని బొబ్బిలి వ్యవసాయ శాఖ ఇన్‌చార్జ్ ఏడీ శ్యామసుందర్ శనివారం హెచ్చరించారు. 'అన్నదాత సుఖీభవ', 'పీఎం కిసాన్' పేర్లతో వచ్చిన లింక్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ శాఖ నుంచి సోషల్ మీడియాలో లింక్స్ పంపే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అనుమానం ఉంటే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.