అక్రమ మద్యం, నాటుసారా నియంత్రణకు కృషి చేస్తున్నామని, బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏఎస్. దొర హెచ్చరించారు. రామభద్రపురం పోలీసు స్టేషన్ ఎస్ఐ ప్రసాదరావుతో కలిసి ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మార్చి నెలలో 490 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని, 173 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తున్నామని తెలిపారు.