క్షయవ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని స్టేట్ ఎయిడ్స్ & టి. బి. కంట్రోల్ కో ఆర్డినేటర్ డాక్టర్ జశ్వంత్ అన్నారు. శుక్రవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ వెల్నెస్ సెంటర్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధిపై 100 రోజులు ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉచితంగా కఫం పరీక్ష, ఎక్స్ రేలు తీయడం కోసం ప్రత్యేక వాహనంలో నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.