గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి. శంకరరావు, రావివలస సర్పంచ్ సోమల కుమారి డిమాండ్ చేశారు. నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ గురువారం ఆర్డిఓ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రెవెన్యూ పరిధిలో ఐదుగురు గిరిజన రైతులకు చెందిన 11. 42 ఎకరాలు భూమి గ్రీన్ ఫీల్డ్ హైవేకు పడినప్పటికి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.