బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడ గ్రామంలో అగ్నిప్రమాదానికి గురైన బాధితులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్ధిక సహాయం అందజేశారు. బొబ్బిలి కోటలో శనివారం బాధితుడు వి. సన్యాసికు ఎమ్మెల్యే అండగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. బాధితునికి దుప్పట్లు, నిత్యావసర సరుకులు, నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బాడంగి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.