బొబ్బిలి మండలం పారది గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషన్ పక్వడా ( పోషణా పక్షం) కార్యక్రమం ఐసీడీఎస్ బొబ్బిలి ప్రాజెక్ట్ సీడీపీఓ జె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పారది అంగన్వాడీ సెంటర్ లో మంగళవారం గర్భిణీలకు చిన్నపిల్లలకు పోషక ఆహారం అందిచడం పోషక ఆహారం పై చిరుదాన్యాల మీద అవగాహన కలిపించడం, మిల్లెట్స్ వంటల్లో రాగి జావ తయారు చేసి చూపించడం జరిగింది.