ముందస్తు సంక్రాంతి వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. సంప్రదాయాలు ఉట్టిపడేలా అంగన్వాడీ సెంటర్ లో సందడి చేస్తున్నారు. అందులో భాగంగా బొబ్బిలి మండలం పారాది గ్రామంలో శుక్రవారం పండుగకు కొత్త శోభ వచ్చింది. ఐసీడీఎస్ బొబ్బిలి ప్రాజెక్ట్ సీడీపీఓ జె విజయలక్ష్మి ఆదేశాలు మేరకు అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ ఆధ్వర్యంలో పిల్లలు కు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తున్నారు. ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు.