బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి మండలాల్లో 9. 5 కిలోమీటర్లు రోడ్డుపై గుంతలు పూడ్చేందుకు రూ. 3 కోట్లతో ఆర్ అండ్ బి ప్రతిపాదనలు చేశారు. చిలకాపాలెం - రామభద్రపురం - బొబ్బిలి రోడ్డుపై బాడంగి, రామభద్రపురం మండలాలతో పాటు బొబ్బిలి మండలంలోని గొర్లెసీతారాంపురం, పారాది, మెట్టవలస వద్ద గోతులు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను నివారించేందుకు, గోతులను పూడ్చేందుకు ఆర్ అండ్ బి అధికారులు ప్రతిపాదనలు చేశారు.