బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా గ్రామానికి చెందిన ఆవాల సత్యం నిర్మించిన మినీ గోకులంను శనివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టాపు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని, అలాగే పాడి పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుoదని తెలిపారు. సచివాలయం కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు వెంకట రమణ, వైస్ సర్పంచ్ ఆవాల రామారావు, ఆవాల పాపారావు తదితరులు పాల్గొన్నారు.