వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సమక్షంలో మంగళవారం తెర్లాం మండలం డి. గడబవలస గ్రామానికి చెందిన 30 యాదవ కుటుంబాలు బొబ్బిలి కోటలోకి వచ్చి చేరారు. వారిని ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, ఎంపీపీ, జడ్పీటీసీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేష్, క్లస్టర్ ఇంచార్జ్ శంకర్రావు ఆధ్వర్యంలో చేరారు.