సార్. ట్రాన్స్ కో అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. ఆత్మహత్యే గతి అని సబ్ స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మేము సూసైడ్ చేసుకుంటాం. మాకు అనుమతి ఇవ్వండి అంటూ గురువారం బొబ్బిలిలోని ఐటీఐ కాలనీ వద్ద ఉన్న 132/33 సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లను ఏడీ ఏగిరెడ్డి సతీశ్ కుమార్, ఏఈ తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన చెందారు. భోజన విరామ సమయంలో కూడా పనులు చెప్పి వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు.