బొబ్బిలి పట్టణం సింగారపువీధిలో ఉన్న శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. ఆలయ నిర్వాహకులు గేంబలి శ్రీనివాస రావు పర్యవేక్షణలో స్వామి వారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ధనుర్మాసం సందర్భంగా స్వామి వారిని అందంగా అలంకరించారు. వాయుగుండం ప్రభావంతో వర్షం కురుస్తున్న పూజలకు తగ్గని భక్తులు వెనుకడుగు వేయడం లేదు.