MSN ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాలలో 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఇంటర్ మరియు డిగ్రీ BA, B com, BSC చదివిన నిరుద్యోగులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ జాబ్ మేళాలో సుమారు 200 వరకు ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉందని అన్నారు. ఈ జాబ్ మేళాకు హాజరు కావలసిన నిరుద్యోగ యువకులు తమ అర్హత సర్టిఫికెట్లు జిరాక్స్లు మరియు బయోడేటా రెండు ఫోటోలు తో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు.