ఐ.సి.డి.ఎస్ సి.డి.పి.ఓ. జే. విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామ ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలో కిషోర వికాసం వేసవి శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా సి.డి.పి.ఓ. జే. విజయలక్ష్మి మాట్లాడుతూ పిల్లలు చదువుపై శ్రద్ధ వహించాలని సూచించారు. బాల్య వివాహాలు నిరోధించాలని తెలిపారు. వైద్యాధికారిణి కనక లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు.