మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యనించిన జర్నలిస్టు కృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షరాలు గోనా మానస, సభ్యులు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బొబ్బిలి డీఎస్పీ భవ్యరెడ్డికు మంగళవారం వినతిపత్రం అందించారు. మహిళలను కించపరిచేలా డిబేట్లో మాట్లాడడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.