డిజిటల్ పేమెంట్ అయితేనే టికెట్స్ ఆదేశాన్ని రద్దు చేయాలని బొబ్బిలి రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. బొబ్బిలి స్టేషన్ సి. సి. చంద్ర గౌడ్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పి. శంకరరావు మాట్లాడుతూ సాధారణ, రిజర్వేషన్ టికెట్లుకు డిజిటల్ పేమెంట్ ద్వారానే టికెట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.