బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం మండలాన్ని నాటుసారా రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖాధికారులు గ్రామ స్థాయిలో పనిచేయాలని ఎక్సైజ్ సీఐ చిన్నంనాయుడు, ఎస్ ఐ ప్రసాద్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నవోదయ 2. 0 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు మండలంలో సారా లేకుండా చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు.