కార్తీక పౌర్ణమి సందర్భంగా బొబ్బిలి ప్రాంతంలోని ఆలయాలు, నదీతీరాలు దీపాల వెలుగులో శోభాయమానమయ్యాయి. శుక్రవారం వేకువ జామునుంచి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పెంట, పారాది, అలజంగి, కారాడ వేగావతి నదీ పరీవాహక ప్రాంతాలలో భక్తులు స్నానమాచరించి నదిలో దీపాలను విడిచిపెట్టారు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక శ్రీవేణుగోపాల స్వామి, శ్రీఆంజనేయ స్వామి ఆలయాల్లో లక్ష దీపారాధన చేశారు.