
రాయచోటిలో ఉగ్రమూలాలపై కొనసాగుతున్న దర్యాప్తు
AP: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. మోస్ట్ వాంటెంట్ టెర్రరిస్టులు అబూబకర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అబూబకర్ సిద్ధిఖీ ఇంట్లో బాంబు పార్శిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిలల్లీ చిరునామాతో బాంబును పార్శిల్ చేసి సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.