సార్వత్రిక ఎన్నికల అనంతరం మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది జరిగింది. ఈ సమావేశాలకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన హాజరయ్యారు. మొత్తం 21 శాఖలపై ఎంపీపీ శంబంగి లక్ష్మీ అధ్యక్షతన రివ్యూ నిర్వహించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ, రోడ్లు భవనముల శాఖలపై ప్రత్యేక రివ్యూ నిర్వహించారు.