బొబ్బిలి: అంగన్వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసం

53చూసినవారు
బొబ్బిలి: అంగన్వాడీల్లో సామూహిక అక్షరాభ్యాసం
బొబ్బిలి ఐ. సి. డి. ఎస్. పరిధిలో గల అన్ని అంగన్వాడి కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని సి. డి. పి. ఓ. జాగాన విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో గల యేడు అంగన్వాడి కేంద్రాల్లో ఆమె ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడేళ్లు నిండిన పిల్లలతో అక్షరాస్య కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్