బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం పెరుమాళి గ్రామంలో బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన మినీ వాటర్ ట్యాంక్‌ను బుధవారం ప్రారంభించారు. వేసవికాలంలో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు పడుతుండడంతో తన సొంత నిధులతో మినీ వాటర్ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తాగునీటికి సమస్య తీర్చినందుకు ఎమ్మెల్యేకు గ్రామస్తుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.