బొబ్బిలి మండలం ముత్తావలస – కలవరాయి గ్రామాల మధ్య ప్రాంతంలో అడవి ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) ఆదివారం ఒక కీలక ఆడియో విడుదల చేశారు. అవి అడవి ఏనుగులని, వాటి జోలికి ఎవరూ పోవద్దన్నారు. ఎక్కువ మంది వాటి దగ్గరకు వెళితే దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు గమనించాలని ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.