బొబ్బిలి: వెయిట్ లిఫ్టింగ్ విజేతను అభినందించిన ఎమ్మెల్యే

56చూసినవారు
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగు విజేతగా నిలిచిన దీసరి భానుప్రసాద్ ను బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన సన్మానించారు. ఈ నెల 4 నుంచి 7వ తేదీల వరకు నేపాల్ లోని ఖాట్మండ్ లో జరిగిన ఎస్ బి కె యఫ్ లో నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 83-220 కేజీల విభాగ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే క్రీడాకారుడిని అభినందించి సన్మానించారు.

సంబంధిత పోస్ట్