బొబ్బిలిలోని ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బేబి నాయన సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, వైద్య సేవలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అభివృద్ధి పనులను చేపడతానని హామీ ఇచ్చారు. త్వరలోనే మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు.