బొబ్బిలి గ్రామాల్లో ఎంఎస్పీలు (మహిళా పోలీసులు) నిఘా నేత్రాలుగా ఉండి, శాంతి భద్రతల పరిరక్షణకు సహకారం అందివ్వాలని రామభద్రపురం ఎస్ఐ వెలమల ప్రసాద్ కోరారు. స్థానిక పోలీసు స్టేషన్లో మంగళవారం ఎంఎస్పీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో బాల్య వివాహాలు నిరోధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో రాజకీయ కక్షలు, వివాదాలపై స్టేషన్ కు వెంటనే సమాచారం అందించాలని సూచించారు.