బొబ్బిలి పురపాలిక వైస్ చైర్మన్‌లపై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. పురపాలిక కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. కౌన్సిల్ సమావేశం హాల్ లో కౌన్సిలర్లతో బొబ్బిలి ఆర్డీఓ రామ్మోహనరావు ఓటింగ్ నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తూ సంతకాలు చేశారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారు.