ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయడం జరిగింది. ఎన్నికల అనంతరం బొబ్బిలి పట్టణం అమ్మి వారి కోనేరు వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని ముసుగు తొలగించాలని బొబ్బిలి మున్సిపల్ అధికారులకు కో ఆప్షన్ సభ్యులు రియాజ్ ఖాన్ తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో బుధవారం తానే స్వయంగా వైయస్సార్ విగ్రహం వద్దకు వెళ్లి ముసుగు తొలగించారు. అనంతరం పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు.