కూటమి ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచబోమని తగ్గిస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు అన్నారు. బొబ్బిలిలో 5, 6, 7వార్డుల్లో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ప్రజలను ప్రజలను పీల్చి పిప్పి చేయడానికే స్మార్ట్ మీటర్లను పెడుతున్నారని ప్రజలు వ్యతిరేఖించాలన్నారు. కార్యక్రమంలో పి. శంకర్రావు మునకాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.