ఆదానితో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా బొబ్బిలి పట్టణం జెండా మహల్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో 15. 485 కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందని అన్నారు.