బొబ్బిలి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

73చూసినవారు
బొబ్బిలి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలి పట్టణం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో నేడు (బుధవారం) విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ ఆవాల అనంతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్నంలో దెబ్బవీధి, రెడ్డిక వీధి, సున్నపు వీధి, రాజుల సందు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. బొడ్డువారి కల్యాణ మండపం వద్ద ట్రాన్స్ఫార్మర్ మార్పు చేయటం వలన ఈ అంతరాయం కలుగుతుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్