విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పరిధిలో గల 33/11 కేవీ సబ్ స్టేషన్ కలవరాయి, జగన్నాథపురం సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వర కు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఈ మేరకు ఏఈ అనంత రావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై వినియోదారులు సహకరించాలని కోరారు.