బొబ్బిలిలో ఐదో వార్డు, జీఎస్ఆర్‌పురంలో ఆదివారం 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబినాయన పాల్గొని ఇంటింటికీ వెళ్లారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేస్తోందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు. అభివృద్ధి పనులను ప్రజలకు వివరంగా తెలిపారు.