కోటిమొక్కలకు పైగా మొక్కలను నాటిన ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు పద్మశ్రీ రామయ్య దేశానికే ఆదర్శనీయుడు, చిరస్మరణీయుడు అని కారుణ్య ఫౌండేషన్ చైర్మన్, రోటరీ జిల్లా చైర్మైన్ జె సి రాజు అన్నారు. సోమవారం బొబ్బిలి ప్రొహిబిషన్, ఎక్ససైజ్ స్టేషన్ ఆవరణం లోవనజీవి రామయ్య మరణం పట్ల నివాళులు అర్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ అధ్యక్షులు సింద్రీ శ్రీనివాసన్ నిర్వహించారు.