తెర్లాంలో చాముండేశ్వరి రైస్ మిల్లును, బాడంగి మండలంలో ఉన్న వెంకట పద్మావతి రైస్ మిల్లును బొబ్బిలి ఆర్ డి ఓ బి. రామ్మోహనరావు శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి తేమశాతం, తడిసిన ధాన్యం కొనుగోలుపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు.