బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ లో బుధవారం అరుదైన ఘటన జరిగింది. ఓ అంధురాలు బస్సు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో ఆమెను ఎవరు పట్టించుకోలేదు. పరిస్థితిని గమనించిన ఓ ఆర్టీసీ కండక్టర్ ఆమె వద్దకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాలో వివరాలు తెలుసుకుని దగ్గరుండి ఆమెను బస్సు ఎక్కించారు. కండక్టర్ చూపిన మానవత్వం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.