బొబ్బిలి: ఈనెల 21న సదరం రీ వెరిఫికేషన్

65చూసినవారు
బొబ్బిలి: ఈనెల 21న సదరం రీ వెరిఫికేషన్
ఈనెల 21వ తేదీ మద్యాహ్నం 2గంటల నుంచి గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో ఎముకల సంబందిత సదరం రీ వెరిఫికేషన్ జరుగుతోందని కోమటిపల్లి సచివాలయం సంక్షేమ సహాయకులు డి. సంతోష్ పట్నాయక్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయం పరిధిలో ఉన్న 41మందికి నోటీసులు అందజేశారు. రీ వెరిఫికేషన్ కు వెళ్లే వారు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు తీసుకొని వెళ్లాలని చెప్పారు. రీ వెరిఫికేషన్ కు వెళ్లకపోతే ఆటోమేటిక్ గా పెన్షన్ ఆగిపోయిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్