హైదరాబాద్ లోని శిల్పా రామoలో ప్రజ్ఞ ప్రవహ్, సంస్కార్ భారతి ఆధ్వర్యంలో జరుగుతున్న భారత్ లార్జెస్ట్ కల్చరల్ ఫెస్టివల్లో ఈనెల 23న తూర్పు భాగవతం ప్రదర్శన ఇవ్వబోతున్న బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన బొంతలకోటి శంకరరావును వైసీపీ నాయకులు శంబంగి వేణు గోపాల నాయుడు పక్కిలో శనివారం ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో తూర్పు భాగవతం ప్రదర్శనకు అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు.