కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్రాంతి కానుకలు వస్తాయని ప్రజలు ఆశించినప్పటికి అవి రాకపోవటంతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ ప్రశ్నించ్చారు. శుక్రవారం బొబ్బిలిలో మీడియాతో మాట్లాడుతూ పేదలకు చంద్రన్న సంక్రాంతి కానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలు పండుగను బాగా చేసుకునేందుకు సంక్రాంతి కానుకలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.