బొబ్బిలి: బకాయి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి

84చూసినవారు
బొబ్బిలి: బకాయి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో బకాయి పన్నుల వసూళ్లపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్ శరత్ బాబు కోరారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. శత శాతం పన్నుల వసూళ్లు సాధించాలని సిబ్బందికి సూచించారు. ఇంటి పన్నుల అసెస్మెంట్ నెంబర్లు డబల్ ఎంట్రీపై దృష్టి సారించాలని కోరారు. కమిషనర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్