బొబ్బిలి మున్సిపాలిటీ లలో వీధి విక్రయదారుల గుర్తింపును వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మీ ఆదేశించారు. మంగళవారం బొబ్బిలి పురపాలక కార్యాలయంలో వార్డు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వీధి విక్రయదారులను మూడు కేటగిరీల్లో విభజించి సర్వే చేయాలన్నారు. మే 17 నాటికి శత శాతం ప్రక్రియ జరగాలని ఆదేశించారు.