బొబ్బిలి: వసతి గృహాల ఆకస్మిక తనిఖీ

50చూసినవారు
బొబ్బిలి: వసతి గృహాల ఆకస్మిక తనిఖీ
రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశాలతో గురువారం బొబ్బిలి మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలను అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం. రోహిణిరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ పిల్లలకు అందించు ఆహారం, నీరు, నాణ్యతతో వుండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. పాతబొబ్బిలిలో ఉన్న బాలసదన వసతి గృహాన్ని, గిరిజన, ఎస్సీ బాలికల కళాశాల తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల బస చేసే గదులు, మరుగుదొడ్లు తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్