బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ రమాదేవిపై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ నెగ్గింది. బుధవారం అవిశ్వాస తీర్మాన పరీక్షకు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియో సభ్యుడు బేబినాయన హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 22మంది అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు రామ్మోహనరావు ప్రకటించారు.