మద్యాహ్న భోజన పథకంను సక్రమంగా అమలు చేయాలని రామభద్రపురం ఎంపీడిఓ యమ్. రత్నం కోరారు. శుక్రవారం కోట శిర్లాం, మామిడివలస గ్రామాల్లో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సరైన సమయానికి ఆహారం పెట్టాలని, అలాగే రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశౠలు ఇచ్చామన్నారు. అలాగే పంచాయతీ సచివాలయం కార్యాలయం రికార్డులను పరిశీలన చేసి పలు సూచనలు చేశారు.