ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతీనెల 1వ తారీఖున ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు అందిస్తుంది. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావునా, ఒకరోజు ముందుగానే అనగా శనివారం పింఛను పంపిణీ చేయనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన శుక్రవారం తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.